
అనుదిన నిరీక్షణ ప్రసారం
అనుదిన నిరీక్షణ ప్రసారం మీ జీవితానికి ఎలాంటి ప్రయోజనాలను తెస్తుంది?

ప్రేరణ
ఈ కార్యక్రమంలో అందించబడిన సందేశాలు చర్య తీసుకోవడానికి మరియు మీ జీవితంలో సానుకూల మార్పు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి.

ప్రోత్సాహం
ఈ కార్యక్రమం నిరీక్షణ మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుంది, మీరు ఒంటరిగా లేరని మరియు మీకు మార్గనిర్దేశం చేసే పరసంబంధమైన శక్తి అందుబాటులో ఉందని గుర్తుచేస్తుంది.

కృతజ్ఞత
ఈ కార్యక్రమం యొక్క సందేశాల ద్వారా, మీరు మీ జీవితంలోని ఆశీర్వాదాల పట్ల మరింత ప్రశంసతో కూడిన భావాన్ని పొందుకుంటారు, కృతజ్ఞత మరియు సంతృప్తిని పెంపొందించుకుంటారు.

సమాధానం
ఈ సందేశాలు జీవిత సవాళ్ల మధ్య సమాధానము మరియు నెమ్మదిని అందిస్తాయి, నిత్యత్వ దృక్పథాన్ని మరియు మీ నిరీక్షణ యొక్క అసలైన మూలాన్ని మీకు గుర్తు చేస్తాయి.

సమాజము
ఈ కార్యక్రమము సమాజమును మరియు ఇతర విశ్వాసులతో సంబంధాన్ని సృష్టిస్తుంది, తనమన భావాన్ని మరియు మద్దతును పెంపొందించడంలో సహాయపడుతుంది.
నేర్చుకోండి, ప్రేమించండి, వాక్యాన్ని జీవించండి
రేడియోలో వాక్యమును ప్రసరించుటకు పాస్టర్ రిక్ యొక్క ఆసక్తి మూడు లోతైన నిశ్చయతలలో నుండి పుట్టింది.
ప్రతి ఒక్కరికి నిరీక్షణ అవసరం. మంచి బైబిల్ బోధన ద్వారా పాఠకులకు రోజువారీ నిరీక్షణను అందించడం పాస్టర్ రిక్ యొక్క లక్ష్యం. ప్రతిరోజూ, రిక్ వారెన్ తో అనుదిన నిరీక్షణ, వారి జీవితానికి సంబంధించిన దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రజలను ప్రోత్సహించడానికి, సన్నద్ధం చేయడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి రూపొందించబడిన లేఖనాల నుండి ఆచరణాత్మకమైన, అన్వయించుకోగలిగిన, అర్థవంతమైన సందేశాన్ని పంచుకుంటుంది. అనుదిన నిరీక్షణ మరియు ఇంకా మరెన్నో పరిచర్యల ద్వారా, యేసు సువార్తను అందుకోకుండా మిగిలిపోయిన XNUMX జాతులను చేరుకోవడానికి విశ్వాసులను ప్రేరేపించాలనేది పాస్టర్ రిక్ ఆలోచన.
