
అనువాదాల సంఖ్య:
25, మరికొన్ని జరుగుచున్నవి!
అనుదిన నిరీక్షణ ధ్యానములు మీ జీవితానికి ఎలాంటి విలువను తెస్తుంది?

సమాధానం
అనుదిన నిరీక్షణ రోజువారీ జీవితంలో గందరగోళం మధ్య శాంతి మరియు నెమ్మదితో కూడిన అనుభూతిని అందిస్తుంది.

ఆనందం
అనుదిన నిరీక్షణ ఆనందం మరియు సంతోషంతో కూడిన అనుభూతిని అందించి, దేవుని ప్రేమ మరియు దయను గురించి మీకు గుర్తు చేస్తుంది.

కృతజ్ఞత
అనుదిన నిరీక్షణ మీ జీవితంలోని ఆశీర్వాదాలను బట్టి కృతజ్ఞతా భావాన్ని మరియు దేవుని ప్రేమ పట్ల ప్రశంసలను ప్రేరేపిస్తుంది.

నిరీక్షణ
అనుదిన నిరీక్షణ ఆశ మరియు ఆశావాద భావాన్ని తెస్తుంది, సవాలుతో కూడిన సమయాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

ప్రేమ
అనుదిన నిరీక్షణ మీకు దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది మరియు ఇతరులను మరింత లోతుగా ప్రేమించేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.

నమ్మకం
అనుదిన నిరీక్షణ దేవునిపై నమ్మకాన్ని పెంపొందిస్తుంది మరియు మీ జీవితంలో ఆయనను మరింత పూర్తిగా విశ్వసించేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.

ధైర్యం
అనుదిన నిరీక్షణ మీ భయాలను ఎదుర్కోవడానికి మరియు అడ్డంకులను అధిగమించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ధైర్యం మరియు శక్తిని అందిస్తుంది.

క్షమాపణ
అనుదిన నిరీక్షణ క్షమాపణ కోరడానికి మరియు ఇతరులకు క్షమాపణను అందించడానికి, దేవునితో మీ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.

ఉద్దేశ్యము
అనుదిన నిరీక్షణ ఉద్దేశ్యం మరియు అర్థము వంటి భావములను అందిస్తుంది, క్రైస్తవునిగా మీ పనిని మీకు గుర్తు చేస్తుంది.

సంబంధం
అనుదిన నిరీక్షణ దేవునితో మరియు ఇతర విశ్వాసులతో ఉండవలసిన అనుబంధమును గూర్చిన భావాన్ని అందిస్తుంది, సాంఘిక మరియు బాంధవ్య భావనను పెంపొందిస్తుంది.
అనుదిన నిరీక్షణ ధ్యానములు


అసాధారణమైన వ్యక్తులు కేవలం ఒక అసాధారణమైన కలను - అనగా దేవుని కలకు - తమను తాము జోడించుకునే సాధారణ వ్యక్తులు అని నేను తరచుగా అనుకుంటాను. మరియు ఏ పని నిమిత్తం దేవుడు మిమ్మును సృజించిన దానికంటే జీవితంలో మరేదీ గొప్ప సంతృప్తిని ఇవ్వలేదని నేను నమ్ముతాను.
మీ కోసం దేవుడు కలిగి ఉన్న వాటి వైపుకు మీరు ముందుకు సాగుతున్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి, నేను అనుదిన నిరీక్షణను వ్రాశాను - ఇది ప్రతి రోజూ మీ ఇన్‌బాక్స్‌కు బైబిల్ బోధనను అందించే నా ఉచిత ఇమెయిల్ ధ్యానము. అనుదిన నిరీక్షణతో అనుసంధానం అవ్వడం వలన మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మరియు ఆయనతో లోతైన మరియు అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మిమ్మల్ని అది ప్రేరేపిస్తుంది. మీరు జీవించాలనుకున్న జీవితాన్ని గడపడానికి ఇది చాలా అవసరం.


అనుదిన నిరీక్షణ అంటే ఏమిటి?
అనుదిన నిరీక్షణ 2013 నుండి ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోని కోట్లాది మంది ప్రజలకు పాస్టర్ రిక్ బోధన ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తోంది. మీరు రేడియో, యాప్, పాడ్‌కాస్ట్, వీడియో, వెబ్‌సైట్, ఇమెయిల్, శిష్యత్వ సాధనాలు మరియు సోషల్ మీడియా (ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, పింటేరెస్ట్ మరియు యూట్యూబ్) ద్వారా అనుదిన నిరీక్షణ బైబిల్ బోధన, భక్తిపాటలు మరియు మరిన్నింటిని పొందవచ్చు.